అమృతవాక్కు



"నీ శక్తే నీ జీవితం... నీ బలహీనతే నీ మరణం..."

స్వామీ వివేకానంద.........


సత్కార్యంతోనే అన్నీ సాధ్యం

మంచి ఆలోచన, దానికి తగినటువంటి ఆచరణ అన్నివిధాలా ఉత్తమమైన మార్గం. కనుక రాబోయే కాలంలో మంచి పని చేద్దామనుకునే దాని కన్నాఇప్పటినుంచే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించటం మంచిది.

సత్కార్యం ఎన్నటికీ నశించదు. ఇది హృదయాన్ని పవిత్రంగా చేసి దివ్యజ్యోతిని వెలిగించి ఆ భగవంతుని దయను మనలపై ప్రసరింపచేయగలదు. నీవు సానుభూతి చూపినచోట నీకు స్నేహం ఉదయిస్తుంది. దయను చూపిన చోట ప్రేమ వికసిస్తుంది.

ప్రేమ అనేది సత్కార్యం యొక్క కార్యరూపమని భగవంతుడు సెలవిచ్చాడు. ఎదుటి వారిపై మన ప్రేమను ప్రకటించేందుకు ఇదే ఉత్తమమయిన మార్గం. ప్రతి సత్కార్యం అమృతత్వం మొలకెత్తటానికి విత్తనం లాంటిది.

ఈ అమృతత్వమే పూర్ణానంద హేతువు. "ఈ లోకంలో ప్రతి మనిషీ పూర్ణానందాన్ని కోరుకుంటాడు. కాబట్టి అటువంటి ఆనందాన్ని కేవలం సత్కార్యం ద్వారానే మానవుడు పొందగలడు".
... స్వామి శివానంద సరస్వతి